Wednesday, March 29, 2017

'నచ్చిన ' పాటలు- 'లోపలి ' మాటలు-26
“పానీరే పానీ తేరా రంగ్ కైసా?జిసమే మిలాదో లగె ఉస్ జైసా” 19 January

(“నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?దేనిలో కలుస్తావో అదే నీ రంగు.)
...
వాన మొదలయ్యింది.యవ్వనంలోఉన్న పడతి పైపడ్డ చినుకు కోర్కెలు రేపింది .కప్పుకు చిల్లులున్న ఇల్లుగలాయనకు భయం కలిగించింది.ఆరుబయల్లో పడుకున్న పిల్లాడికి చలికలిగించింది.జరుగుబాటు ఉన్న కుటుంబానికి వినోదంకలిగించింది. హోటల్లో పెనంపై పడ్డ చినుకులు ఆవిరయ్యాయి.కార్మికుల కోర్కెల సాధనకు దీక్షలో ఉన్న వ్యక్తి కి ప్రశ్నలు రేకెత్తించింది.గ్లాసుల్లో ఉన్న రంగుల పానీయాల్తో కలిసి అదే రంగు తనదిగా చేసుకుంది.పిల్లవాడు వదిలిన కాగితపు పడవను ముంచేసింది.అక్కడ ఉన్న ప్రతీ వ్యక్తికి విభిన్నమైన అనుభూతులు కలగజేసింది.
దేశభక్తి ని ప్రేరేపించే సినిమాలు తీసి మిస్టర్ భరత్ గా పిలవబడే మనోజ్ కుమార్ 'షోర్ ' సినిమా తీసాడు. కుటుంబసభ్యులు, ప్రత్యేకంగా తండ్రీకొడుకులమధ్య సెంటిమెంటుతో సాగే సినిమా అది. ఆ సినిమాలోనూ సోషలిస్ట్ ధోరణిలో సాగే ఒక పాట ఉంచాడు. ఐతే ఆపాటలోనూ తన సౌందర్య(?)దృష్టి వదులుకోలేదు.
ఆ పాట (సంతోష్ ఆనంద్ రచన,లక్ష్మికాంత్ ప్యారేలాల్ సంగీతం,ముకేష్ ,లతామంగేష్కర్ గానం.)
“నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
దేనిలో కలుస్తావో అదే నీ రంగు.
ఈ లోకంలో ఉండే కొందరు ఇలాకూడా బ్రతుకుతారు.
ఎండిన రొట్టె తిని చల్లని నీరు తాగుతారు
ఓ గుక్కెడు నీరు తాగితే స్వర్గసమానమైన సుఖం దొరుకుతుంది
నీరూ..ఓ నీరూ నీ రంగు ఎలాఉంటుంది?
కడుపు మాడిన వాని ఆకలిదప్పిక లా ఉంటుంది
నీరూ ..ఓ నీరూ..
గంగతో కలిసినపుడు గంగాజలమై పవిత్రమౌతావు.
మేఘంతో కలిసినపుడు చిటపట కురిసే వానవౌతావు
వర్ష రుతువు వచ్చింది..
వర్షరుతువొచ్చింది..చిటపట చినుకులు రాలుతున్నాయి
అగ్గిసెగ తగిలిన మంచులాకరిగింది నా వయసు..
ఎటుచూసినా ఇంటికప్పునుండి నీరుకారుతూనే వుంది ..జీవించడం కష్టమౌతుంది
నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
లోకాన్ని సృష్టించిన భగవంతునిలా ఉంటుంది.
నీరూ..ఓ నీరూ..
నువ్వు ఏరంగుతో కలిసినప్పటికీ నీ మెరుపు తెలుస్తూనే ఉంటుంది
ఆశలపై నీళ్ళు చల్లినప్పుడు మాత్రం నీరంగేదో అంతుపట్టదు.
మొగ్గ విచ్చినప్పుడే ఆకురాలుకాలపు సందేశం వచ్చినట్టుంది
నీరూ..ఓ నీరూ.. నీ రంగు ఎలాఉంటుంది?
నూరేళ్ళు బతకాలనే ఆశ లా ఉంటుంది”
ఈ పాటలో ప్రత్యేకంగా కొన్ని వాక్యాలు మనసును తడతాయి.
“భూఖె కి భూఖ్ ఔర్ ప్యాస్ జైసా”
“దునియా బనానే వాలే రబ్ జైసా”
“జబ్ తు ఫిరె ఉమ్మీదో పర్ తెరా రంగ్ సమఝ్ న ఆయే”
-ముళ్ళపూడి సుబ్బారావు

No comments:

Post a Comment